ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్ట్ లో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 59 శాతం రిజర్వేషన్ల జీవోని హైకోర్ట్ కొట్టేసింది. సుప్రీం కోర్ట్ తీర్పుకి విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల నిర్ణయించింది అంటూ హైకోర్ట్ పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50 శాతంలోపే రిజర్వేషన్లు ఖరారు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఈ నెలాఖరులోగా ఇది ఖరారు చెయ్యాలని సూచించింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం 59.9 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జీవో విడుదల చేసింది. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్దత నెలకొంది. అయితే కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది అంటూ పలువురు కామెంట్ చేసారు. మరి ప్రభుత్వ౦ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. పంచాయితి ఎన్నికలను బడ్జెట్ సమావేశాల లోపే పూర్తి చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా కోర్ట్ తీర్పు అడ్డం పడింది.