ఫిట్ నెస్ కోసం రకుల్ విన్యాసాలు అద్భుతం ..!

-

టాలీవుడ్ లో కొన్నాళ్ళు మెరుపులు మెరిపించి ఇప్పుడు ఉత్తరాది వాసన చూస్తున్న జీరో సైజ్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం విన్యాసాలు కూడా చేస్తుంది. తెలుగులో కేవలం చీరలు, నగలు ప్రకటనలకే పరిమితం అయిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో కాస్త కొత్తగా ట్రై చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆమె జిమ్ కి వెళ్తూ ఫిట్ గా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండటమే కాదు ఆక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ కాళ్ళు పైకి తల కిందకి పెట్టి ఒక విన్యాసం చేసింది. ఆమెకు గత ఏడాది బాలీవుడ్ లో రెండు హిట్స్ రావడం ఇప్పుడు అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ తరహా విన్యాసాలతో మరింతగా దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంది.

డి దే ప్యార్ దే మరియు మార్జావాన్ సినిమాలు గత ఏడాది హిట్ అయ్యాయి. ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఒక చిత్రంలో ఆమె అజయ్ దేవ్‌గన్ మరియు సిద్దార్థ్ మల్హోత్రాతో నటిస్తున్నారు. తాను చేసిన ఈ వీడియోని మీ ఇంట్లో తయారు చేయవద్దని ఆమె తన అభిమానులను కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news