అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర వివాదాల కారణంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం వద్ద నిలిచిపోయిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో 600 మంది పాల్గొనాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే సింగిల్ జడ్జి తీర్పున సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది.
రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర పై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్ ను హైకోర్టు కొట్టి వేసింది. పాదయాత్ర పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పార్టీలు కానీ వారు పిటిషన్ వేస్తే అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ పిటిషన్ వేయడం న్యాయబద్ధం కాదని పేర్కొంది. రిట్ అప్పీల్ కి కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.