తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌.. నోటీసులు జారీ

-

రాష్ట్ర సర్కార్ కు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోకాపేటలో బీఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు విచారణ సందర్బంగా ఆదేశించింది. కాగా కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూమి కేటాయించారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Telangana High Court declines to interfere in civil administration - The  Hindu

ఈ పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేవలం రూ. 3.41 కోట్లకే కేటాయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భూ కేటాయింపు డాక్యూమెంట్లను రహస్యం చేశారని అన్నారు. అయితే ఈ భూమిలో మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు కేటాయించామని ప్రభుత్వం పేర్కొంది. అయితే హైదరాబాద్‌లో మర్రి చెన్నా రెడ్డి హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ లాంటి సంస్థలు కూడా అదే ఉద్దేశ్యంతో ఉండగా కొత్త కేంద్రం అవసరమేంటని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు , తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news