రేపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఏమ్మెల్సీ ఉప ఏన్నిక పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 నుంచి 5 వరకూ పోలింగ్ జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లు ఉండగా వారందరికీ కరోనా పరీక్షలు చేశారు. అందులో 24 మంది కరోనా బారిన పడ్డారు. వారందరినీ చివరిగా వోట్ వేసే అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్దతిలోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ సిబ్బందికి ఇవాళ అధికారులు మెటీరియల్ అందించనున్నారు. అలానే ఈ నెల 12న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే కరోనా దృష్ట్యా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ కేంద్రంలో 1+2 సిబ్బంది ఉండనున్నారు. 48 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికి చివరి గంటలో పోలింగ్ కు అవకాశం ఇవ్వనున్నారు. వారందరినీ పీపీఈ కిట్లు ధరించి సొంత వెహికిల్ లో రావాలని అధికారులు సూచించారు.