BREAKING : పోసాని ఇంటిపై రాళ్లదాడి

-

జ‌న‌సేనాని పవన్ కళ్యాణ్ ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ పోసాని మ‌ధ్య జ‌రుగుతున్న మాట‌ల యుద్దం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు. అయితే తాజాగా పోసాని కృష్ణ మురళి ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగినట్లు సంచారం అందుతోంది.

అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డి గూడలోని పోసాని ఇంటిపై ప్రాంతంలో రాళ్లు విసిరారు కొందరు దుండగులు. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయారు దుండగులు. దీంతో భయాందోళనలకు గురయ్యారు పోసాని కృష్ణ మురళి ఇంటి వాచ్ మెన్ కుటుంబ సభ్యులు. అయితే ఎనిమిది నెలలుగా పోసాని కుటుంబం వేరే చోట నివాసం ఉంటున్నారు. ఇక రాళ్లదాడి నేపథ్యం లో సంజీవ రెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాచ్ మెన్.. దీంతో కేసు నమోదు చేసుకున్న సంఘటన స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. పోసాని సమీపంలోని సిసి ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు..

Read more RELATED
Recommended to you

Latest news