తిరుమలలో తీవ్ర ఉద్రిక్తత !

తిరుమల శ్రీవారి ఉచిత దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెక్స్ దగ్గర వేలాదిమంది జనం పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో కనీసం భౌతికదూరం లేకుండా టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. మాస్క్‌లు లేకుండా క్యూలైన్లలో నిలబడి ఉండటంతో కరోనా టెన్షన్ నెలకొంది. అయితే రోజుకి మూడువేల మందికి మాత్రమే ఉచిత దర్శన టోకెన్లు ఇస్తోంది టీటీడీ.

ఉదయం ఇచ్చే టోకెన్ల కోసం నిన్న రాత్రి క్యూలైన్‌లలో నిల్చున్నారు భక్తులు. టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరగింది. దీంతో ఈ భూదేవి కాంప్లెక్సు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిటిడి ఉన్నతాధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. గోవిందా గోవిందా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. భూదేవి కాంప్లెక్సు దగ్గరికి చేరుకున్న అదనపు ఈవో ధర్మా రెడ్డి భక్తులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.