పంచాయతీ ఎన్నికల తీర్పు ఒంటిగంటకు..మరి నామినేషన్ ల మాటేమిటి ?

-

ఏపీలో పంచాయతీ ఎన్నికల మీద ఉత్కంఠ వీడడం లేదు. ఎన్నికలు నిర్వహించలేము అని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి తీరాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక ఈ రోజు సుప్రీం కోర్టులో ఏపీ పంచాయతీ ఎన్నికల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మొదలు కానుంది. అయితే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ సర్కారు చెబుతోంది.

వ్యాక్సిన్ సమయంలో విధులు నిర్వహించలేము అని ఉద్యోగ సంఘాలు కూడా పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో సుప్రీం కోర్టు తీర్పు మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక మరో పక్క విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో ఈరోజు నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ స్వీకరణకు 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పటికీ జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ ను ఇంకా ఆయా జిల్లాల కలెక్టర్లు జారీ చేయలేదు. నామినేషన్ల స్వీకరణకి అందుబాటులో ఉండము అని సిబ్బంది చెబుతున్నారు. అయితే నామినేషన్లు దాఖలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ?

Read more RELATED
Recommended to you

Exit mobile version