ఆనందయ్య ఐ డ్రాప్స్ పై హైకోర్టు తీర్పు నేడే..

ఆనందయ్య మందుపై ఎంత చర్చ జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని రోజులుగా కృష్ణపట్నం వార్తల్లోనే ఉంది. ఆయుర్వేద మందు కరోనాకి బాగా పనిచేస్తుందని రకరకాల వాదనలు వినిపించిన నేపథ్యంలో కేంద్ర ఆయుష్ బృందం ఆనందయ్య మందుని పరిశీలించి,ఇందులో వాడే పదార్థాలు హానికరం కాదని, కానీ దీన్ని ఆయుర్వేద మందుగా పరిగణించలేమని తేల్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆనందయ్య మందుని కంట్లో వేయడంపై హైకోర్టు తీర్పు రానుంది.

మందుని కంట్లో వేయడం వల్ల ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్ళకి మేలు జరుగుతుందని, కరోనా తీవ్రంగా ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా మందు కంట్లో వేయడం గురించి హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ మేరకు దీనిపై తీర్పు వెలువడనుంది. కంట్లో వేయాలా వద్దా అనే విషయమై హైకోర్టు తన తీర్పు వెలువరించనుంది. ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.