కర్ణాటకలో ప్రస్తుతం ‘ హిజాబ్ ’ వివాదం నడుస్తోంది. ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించిన స్కూళ్లకు హాజరవుతుండగా… మరో వర్గం కాషాయ కండువాలతో స్కూళ్లకు, కళాశాలకలు రావడం ఉద్రికత్తలకు కారణం అవుతోంది. కర్ణాటక ప్రభుత్వం మాత్రం స్కూళ్లు, పాఠశాలల్లో తప్పకుండా యూనిఫాం పాటించాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ హిజాబ్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. కాలేజీ, స్కూళ్లకు మీరు బుర్ఖాలు వేసి పంపించాలని అనుకుంటే సపరేట్ స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. చాలా వరకు మీవి మదర్సాలు ఉన్నాయని.. వేల కోట్ల రూపాయలతో నడుస్తున్నాయని వాటిలో వెళ్లి చదువుకోవాలని సూచించారు. కర్ణాటక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని.. స్కూళ్లకు వచ్చిన తర్వాత నేను హిందూ, నేను ముస్లీం అంటూ బేధాలు రావద్దని మనమంతా ఒక్కటే సమానం అనే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సపోర్ట్ చేయండి.. నిరసన తెలిపితే మీకే నష్టం అంటూ వ్యాఖ్యలు చేశారు.