కర్ణాటక ‘హిజాబ్’ వివాదం… రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

-

కర్ణాటకలో పలు జిల్లాల్లో ‘ హిజాబ్’ వివాదం నడుస్తోంది. ముస్లీం విద్యార్థినిలు హిజాబ్ ధరించి కళాశాలకు రావడాడంతో… హిందు విద్యార్థులు కాషాయ కండువాలతో తరగతులకు హాజరవుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. రోజురోజుకు ఈ వివాదం ముదురుతోంది. ప్రస్తుతం ఈ అంశం కర్ణాటక హైకోర్ట్ లో ఉంది. ఉడిపి, కొప్పల్ జిల్లాలకే పరిమితమైన ఈ వివాదం మెల్లిగా ఇతర జిల్లాలకు కూడా పాకుతోంది. తాజాగా బెల్గావి లోని కొన్ని కళాశాలలకు హిజాబ్ ధరించి విద్యార్థినిలు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్, అధికార బీజేపీ పార్టీల మధ్య తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలకు కారణం అవుతోంది. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ‘‘విద్యార్థుల హిజాబ్‌ను వారి చదువుకు అడ్డంకిగా మార్చడం ద్వారా మనం భారత కుమార్తెల భవిష్యత్తును దోచుకుంటున్నాం. మాత సరస్వతి అందరికీ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆమెకు భేదం లేదు’’ అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news