కేసీఆర్ ఫార్ములాతో గులాబీ ఎమ్మెల్యేల్లో గుబులు?  

-

ఏదేమైనా గులాబీ బాస్ కేసీఆర్ రూట్ మర్చినట్లే కనిపిస్తున్నారు…ఇంతకాలం మూడోసారి గెలుపుపై కేసీఆర్ పెద్దగా ధీమాగా కనబడలేదు. కానీ తాజాగా మాత్రం గెలుపుపై కామెంట్ చేశారు..అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా 95-105 సీట్లు గెలుచుకుని మూడో సారి అధికారంలోకి వస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇక మళ్ళీ గెలవడానికి తమ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉందని కూడా అన్నారు.

మరి ఇప్పటికే టీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరిగిని..ఈ తరుణంలో టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది చాలా కష్టమని చెప్పి పలు సర్వేలు చెబుతున్నాయి. ఓ వైపు ప్రతిపక్షాలు దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్తితుల్లో కూడా కేసీఆర్ గెలుపుపై చాలా కాన్ఫిడెన్స్‌తో మాట్లాడారు. ఇటీవల కొన్ని సర్వేల్లో టీఆర్ఎస్‌కు 30-40 సీట్లు వరకు మాత్రమే వస్తాయని తెలిసింది. ఇంకా కష్టపడితే ఇంకో ఐదు సీట్లు పెరగొచ్చని, కానీ టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదని సర్వేల్లో తేలింది.

అలాంటిది కేసీఆర్ మాత్రం గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. అలాగే తమ దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ కూడా ఉందని అంటున్నారు. మరి గెలుపుపై ధీమాగా ఉండటానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కారణం అవుతాయా? అనే డౌట్ విశ్లేషకుల్లో వస్తుంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్..టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని కథనాలు వస్తున్నాయి. అందుకే కేసీఆర్ గెలుపుపై ధీమాగా మాట్లాడుతున్నారని డౌట్ వస్తుంది.

అదే సమయంలో ఎలా గెలవాలనే అంశంపై పక్కా వ్యూహాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా ఉండటమే గెలుపు రహస్యమని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. ఇక వారిలో చాలామందికి సీట్లు ఇవ్వకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. దాదాపు 50 మంది వరకు సీట్లు దక్కవని తెలుస్తోంది. మరి చూడాలి కేసీఆర్ ఎమ్మెల్యేల మార్పు చేసే ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news