హిజాబ్ పై కర్ణాటక హైకోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా నిరసనలు

-

హిజాబ్ పై కర్ణాటక హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఆందోనళలు మొదలవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హిజాబ్ అంశంపై ఈరోజు కర్ణాటక హైకోర్ట్ సంచలన తీర్పును వెల్లడించింది. హిజాబ్ ముస్లిం మతంలో తప్పనిసరి ఆచారం కాదని… విద్యా సంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని సంచలన తీర్పు వెలువరించింది. ఇస్లాంలో హిజాబ్ ధరించాలనే నిబంధన లేదని హైకోర్ట్ పేర్కొంది. హిజాబ్ బ్యాన్ పై దాఖలైన పిటీషన్లను కొట్టేసింది. 

దీనిపై తాజాగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై కొన్ని ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చెన్నైలోని ది న్యూ కాలేజీ విద్యార్థులు నిరసన చేపట్టారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి హైకోర్ట్ తీర్పును స్వాగతించారు. విద్యార్థులంతా హైకోర్ట్ ఆదేశాలను పాటించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ఇది పిల్లల విద్యకు సంబంధించిన అంశం అని వ్యాఖ్యానించారు. మరోవైపు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా తీర్పును స్వాగతించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్… కోర్ట్ ఈ తీర్పు ఎలా ఇచ్చిందో తెలియడం లేదని.. ఇస్లాంలోని ఆచారాలను రాజ్యాంగం ఆమోదించిందని.. విద్య కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news