కర్ణాటకలో మొదలైన ‘ హిజాబ్’ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. చిన్నగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మొదలైన ఈవివాదం చిక్ మంగళూర్, బెలగావి, కొప్పెల, మాండ్యా జిల్లాలకు విస్తరించాయి. ఈ వివాదం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్ట్ విచారిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్ లో కూడా హిజాబ్ వివాదంపై పిటీషన్ దాఖలు అయింది. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ ఈ పిటీషన్ వేశారు. అయితే ప్రస్తుత కర్ణాటక హైకోర్ట్ లో విచారణ నడుస్తోందని.. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్ట్ వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ వివాదానికి సంబంధించిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా జాబితా చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ లో ఈ రోజు విచారణ జరుగుతుందని.. సుప్రీం కోర్ట్ సదరు పిటిషన్ దారుడికి చెప్పింది. ఈ దశలో ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇది నిర్దిష్ట తేదీని ఇవ్వడానికి నిరాకరించింది సుప్రీం కోర్ట్.