హిందూ – ముస్లిం అనగానే ఆగం కావొద్దు – మంత్రి కేటీఆర్

-

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ను ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 97 ఏండ్లు జీవించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య పోరాటం సహా అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. ఉద్యమం లో తానూ పోరాటం చేయడమే కాదు పోరాట యోధులకు సహకారం అందించారని కొనియాడారు.

స్వాతంత్య్రం రాక ముందే కాదు.. వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం లో ముందజలో ఉన్నారని అన్నారు. తెలంగాణ వైతాళికుల ను గొప్పదనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియజేసెందుకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవ్వరూ అడగకుండానే తెలంగాణలో కొత్త జిల్లాలకు, యూనివర్సిటీ లకు, సంస్థలకు తెలంగాణ వైతాళికుల పేరు పెట్టామన్నారు మంత్రి కేటీఆర్. బండి సంజయ్ కి దమ్ముంటే నేతన్నల వస్త్రాల పై వేసిన GST నీ కేంద్ర ప్రభుత్వంతో రద్దు చేయించాలని సూచించారు.

హిందూ ముస్లిం అనగానే ఆగం కావద్దు. ఎవ్వరూ ఏం చేశారో అర్దం చేసుకోవాలని అన్నారు. కాళేశ్వరంకు, పాలమూరు ఎత్తిపోతల పథకం కు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. కులం,మతం పేరుతో చేసే రాజకీయాల పై ప్రజలు నిగ్గ దీయాలని సూచించారు. 8 ఎండ్లలో ఎవ్వరూ ఏం చేశారో ఆలోచించాలన్నారు. మహనీయులను కడుపులో పెట్టుకునే సంస్కారం మా ప్రభుత్వం కు ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news