సామాన్య ప్రజలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కూరగాయల దగ్గర నుంచి వంట నూనె దాకా విపరీతంగా రేట్లు పెరిగాయి. యుద్ధం కారణంగా ఇప్పటికే వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు రోజురోజుకు పెట్రోల్, డిజిల్ ధరలు పెరుగుతున్నాయి. వీటి ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా సబ్బులు, డిటర్జెంట్ల ధరలు కూడా పెరిగాయి. ప్రముఖ కంపెనీ హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ సబ్బులు, డిటర్జెంట్ల ధరలను మరోసారి పెంచాయి. డవ్, పియర్స్, లైఫ్ బాయ్, వీల్, వీమ్ ధరలను 3 నుంచి 20 శాతం దాకా పెంచాయి. అత్యధికంగా డవ్, పియర్స్ సబ్బులపై ధరలను 20 శాతం వరకు పెంచింది. డవ్ సబ్బు 25 గ్రాములు రూ. 10 నుంచి రూ. 12 వరకు పెరిగాయి. వీమ్ లిక్విడ్ ( 500 మి.లీ) ధరల రూ. 99 నుంచి రూ. 104, వీల్ డిటర్జెంట్( 500 గ్రాములు) రూ. 32 నుంచి రూ. 33 వరకు పెరిగాయి.