ఆది శంకరాచార్య జయంతి : నలు దిక్కుల నాలుగు పీఠాలు ఇవే !

-

దేశంలో పాషాంఢ మతాలను రూపుమాపి సనాతనధర్మంలోని సత్యాన్ని లోకానికి తెలపడమే కాక సనాతన ధర్మ రక్షణ కోసం భారత దేశంలో నాలుగుపక్కల నాలుగు పీఠాలను శ్రీ శంకరులు ఏర్పాటుచేశారు.


శంకరుడు దేశం నాలుగు మూలలలో నాలుగు మఠాలను స్థాపించాడు. వీటిని చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుని వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకు తార్కాణం. అవి హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి. సుస్థిరం చేయడానికి, వ్యాప్తిచేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుండి నేటివరకూ అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరుడు ఎంత పటిష్ఠంగా నిర్మించాడో తెలుస్తుంది. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలుగా పనిచేశాయి. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమించబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి పాతపేరు తీసేసి ‘సన్యాసి’ అని సూచించే కొత్తపేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేకమైన నామాన్ని యోగపట్టము అని అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించాడు.

అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. శంకరుల మనోగతం బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఆది శంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించాడు. భగవంతుడిని నమ్మే వారందరినీ షన్మత వ్యవస్థలోకి ఏకీకృతులను చేశాడు.

వేదాలకు తరిగినగౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు. గుజరాత్‌లో, పూరీ, శృంగేరి, కంచిలో నాలుగు పీఠాలను ఏర్పాటుచేసి ఆయన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. ఆయా పీఠాలు నేటికి సనాతనధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news