వైద్యరంగంలో అద్భుతం.. హెచ్ఐవీ నుంచి కోలుకున్న మహిళ

-

వైద్యరంగంలో అద్భుతం చోటు చేసుకుంది. మరణమే తప్పితే… కోలుకోవడం అనే ప్రశ్నే లేకుండా ఉన్న హెచ్ఐవీ నుంచి ఓ మహిళ కోలుకుంది. హెచ్ఐవీ-ఎయిడ్స్ వస్తే దాదాపుగా మరణమే అనుకుంటున్న సమయంలో ఓ మహిళ అనూహ్యంగా కోలుకోవడం వైద్య రంగంలో కీలక ముందడుగా చెప్పవచ్చు.

అమెరికాలో నాలుగేళ్లుగా హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళ యాంటీరిట్రో వైరల్ థెరపీని తీసుకుంటుంది. అయితే ఈమెకు శాస్త్రవేత్తలు మూలకణ చికిత్స అందించారు. వంద రోజుల తర్వాత పరీక్షించగా.. ఆమెలో హెచ్ఐవీ జాడే కనిపించలేదు. ఈ విషయాన్ని ‘రెట్రో వైరస్ అంటువ్యాధుల’పై  నిర్వహించిన సదస్సులో పరిశోధకులు తెలిపారు. కార్డ్ స్టె్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానలో హెచ్ఐవీ నుంచి విముక్తి పొందిందని చెప్పారు. ఈ విధానంలో ముగ్గురు మహిళలు కోలుకున్నట్లు వెల్లడించారు.

ఈ చికిత్స విధానం హెచ్ఐవీని ఎదుర్కొనేందుకు ముందడుగా చెప్పవచ్చు. గత దశాబ్ధాదాలుగా హెచ్ఐవీకి మందు కొనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు నివారణే తప్పితే.. మందు లేని వ్యాధిగా హెచ్ఐవీ ఉంది. అయితే తాజాగా చేసిన పరిశోధనలు హెచ్ఐవీ రోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news