జులై 5 న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్. దాదాపు నెల రోజుల నుంచి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
గత ఫిబ్రవరిలో మొదటి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఇప్పుడు రెండోసారి కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో… మధ్యంతర బడ్జెట్ కు కొనసాగింపుగా… 2019-20 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు.
జులై 5 న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్. దాదాపు నెల రోజుల నుంచి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ లో ఏఏ అంశాలు ప్రస్తావించాలి.. సామాన్య ప్రజలకు ఎటువంటి పథకాలు ప్రారంభించాలి.. బడ్జెట్ కేటాయింపులు దేనికి ఎలా ఉండాలి అనే అంశాలపై ఆమె కసరత్తు చేస్తున్నారు.
అయితే.. జనాల్లోనూ అంతే స్థాయిలో కేంద్ర బడ్జెట్ పై ఆశలు ఉన్నాయి. అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ లో ప్రకటించిన కొన్ని పథకాలను మళ్లీ ఇప్పుడు ప్రకటిస్తారా? లేక వాటికి మంగళం పాడుతారా? అనే విషయాపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఆదాయ పన్ను రిబేట్ ను పెంచారు. 5 లక్షల వరకు రిబేట్ పై పన్ను కట్టాల్సిన అవసరం లేదు. మరి… ఇప్పుడు అది అలాగే ఉంచుతారా? లేక ఆదాయపు పన్ను పరిమితులపై ఏవైనా మార్పులు చేస్తారా? అనేది తెలియదు.
మరోవైపు.. గృహ రుణాలపై వడ్డీకి ఉన్న పన్నును తగ్గించాలంటూ చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు గృహ రుణాలపై ఉండే పన్ను తగ్గింపు 2 లక్షల వరకు ఉంది. అయితే.. దాన్ని 2 లక్షల నుంచి మరింత పెంచాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. గృహ రుణాలపై ఉండే పన్ను తగ్గింపు పరిమితిని కనుక పెంచితే.. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. ప్రతి సామాన్యుడి సొంతింటి కల నెరవేరుతుంది.
ఇలా.. ఏ రంగానికి ఎన్ని కేటాయింపులు చేస్తారు? ఏ రంగానికి ఆర్థిక ఊతమిస్తారు? సామాన్య ప్రజలకు ఎటువంటి తీపి కబురు చెబుతారు. పేదలకు ఇచ్చే భరోసా ఏంటి? రైతులకు ఏ పథకాలు ప్రకటిస్తారు? పెట్టుబడి సాయం ఇంకా పెంచుతారా? అనే అంశాలపై ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ రానుంది.