Holalkere Anjaneya: సిద్ధరామయ్య మా రాముడు.. అయోధ్యలో ‘బీజేపీ రాముడు’ని ఎందుకు పూజించాలి?..

-

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అంతేకాకుండా.. అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లి బీజేపీ రాముడిని ఎందుకు పూజించాలని అన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధరామయ్యను హాజరు కావాల్సిందిగా ఎందుకు ఆహ్వానించలేదని మీడియా ప్రశ్నించారు. దానికి ఆంజనేయ స్పందిస్తూ…సిద్ధరామయ్యే మా రాముడు అయినప్పుడు అయోధ్యకు వెళ్లి ఆ రాముని ఎందుకు పూజించడ అని ప్రశ్నించారు. అయోధ్య రాముడు బీజేపీకి చెందిన రాముడు అని పబ్లిసిటీ కోసమే బీజేపీ అధిష్టానం ఇలా చేస్తోందని విమర్శించారు.

మన రాముడు మన గుండెల్లో ఉన్నాడని ఆంజనేయ అన్నారు. ఆంజనేయ అనేది హిందూ దేవుడు హనుమంతునికి ఇంకో పేరు.రామాయణంలో శ్రీరాముని సేవకి అంకితమైన ఒక గొప్ప భక్తుడు. రామమందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి ఆహ్వానం తనకు అందలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఈరోజు వరకు తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ ఆహ్వానం వస్తే పరిశీలిస్తానని ఆయన అన్నట్లు సమాచారం.కాగా.. కాంగ్రెస్  పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version