స్కూళ్లకు సెలవులు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

-

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మర్ హాలిడేస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటించారు.

కాగా, ఎండాకాలంలో వచ్చే సమయాన్ని విద్యార్థులు పూర్తిగా వినియోగించుకునేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. “సెలవుల్లో సరదాగా 2024” అనే పేరుతో కొత్త కార్యక్రమాన్ని విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను, అలాగే విద్యార్థుల్లో పఠనాశక్తిని సెంపెందించడాని టీచర్లు, హెచ్‌ఎమ్లు.. వి లవ్ రీడింగ్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు స్థానిక కమ్మునిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం 2024 జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news