హోలీ స్పెషల్ స్వీట్స్: మీ ఇంట్లో ఇలా ఈజీగా గుజియా చేసేయండి…!

-

ఇక హోలీ పండగ దగ్గర పడింది. మీరు హోలీ సందర్భంగా మీ స్నేహితులకు, బంధువులకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా..? అయితే మీరే ఇంట్లో ఈ స్వీట్ ను తయారు చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వొచ్చు. అయితే గుజియా ఎలా చేయాలి అనేది ఇప్పుడే చూసేయండి.

గుజియా కి కావలసిన పదార్థాలు:

గోధుమపిండి
మైదా పిండి
అర టీ స్పూన్ సాల్ట్
నెయ్యి
డ్రై ఫ్రూట్స్
కోవా
పంచదార పొడి
నూనె
యాలకలు పొడి

గుజియా తయారు చేసుకునే విధానం:

ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమపిండి మరియు మైదా పిండి వేసి అరటి టీ స్పూన్ సాల్ట్ కూడా వేయండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ ఉండండి. దీనిలో అర టీ స్పూన్ నెయ్యి కూడా పిండిలో వేసి బాగా కలపండి. పిండి ఎంత బాగుంటే రెసిపీ ఎంత బాగా వస్తుంది. మంచిగా అయ్యే వరకు కలపండి. ఇప్పుడు తడి క్లాత్ ని మూత వేసి అరగంట పాటు ఉంచండి.

ఈలోగా మీరు డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు గ్రేట్ చేసిన కోవా ని తీసుకుని లో ఫ్లేమ్ మీద కోవాని బాగా కలపండి. ఇప్పుడు దానిని చల్లారే దాకా పక్కన పెట్టండి. చల్లారాక దానిలో పంచదార పొడి, డ్రైఫ్రూట్స్ మరియు యాలుకల పొడి వేయండి.

దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. పంచదార సరిపోయిందో లేదో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు పిండిని తీసుకుని గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు కోవా ఫిల్లింగ్ తో దీన్ని ఫిల్ చేయండి.

గుజియా మాదిరి వాటిని లోపల ఫిల్ చేస్తూ వత్తుకోండి. మీరు కావాలంటే వీటిని బేక్ చేయవచ్చు లేదు అంటే ఆయిల్లో ఫ్రై చేయొచ్చు. నూనె బాగా వేడెక్కిన తర్వాత దానిలో వేసి ఫ్రై చేసి టిష్యూ పేపర్ మీద వేసి నూనె ఓడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. వీటిని మీరు అందమైన స్వీట్ బాక్స్ లో పెట్టి మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version