హోమ్ లోన్‌పై రూ.10 లక్షల వడ్డీని ఇలా తగ్గించుకోండి..!

-

సొంతింటి కల సాకారం చేసుకోవడానికి చాలా మంది హోమ్ లోన్స్ ని తీసుకుంటారు. వీటి ద్వారా లోన్ వస్తుంది. ఆ డబ్బు తో ఇల్లు కట్టుకొచ్చు. అయితే పండుగ సీజన్‌ లో హోమ్‌ లోన్‌ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. తాజాగా చాలా బ్యాంకులు హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లని తగ్గించాయి.

అలానే వడ్డీ రేట్లు తగ్గించడం తో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు వంటి రాయితీలు అందిస్తున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇప్పుడు బాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లని తగ్గించాయి కనుక హోమ్‌ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయంగా చెప్పుకో వచ్చు.

అదే విధంగా లోన్ బదిలీ చేసి వడ్డీ రేటు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్న వారికి కూడా ఇది గొప్ప అవకాశం. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు 15 సంవత్సరాల కనిష్ఠ స్థాయిలో ఉన్నాయి. అయితే గడిచిన 18 నెలల కాలం లో రిజర్వ్‌ బ్యాంక్‌ రెపో రేటు 115 పాయింట్లు అంటే 1.15 శాతం తగ్గించింది. దీనితో అనేక బ్యాంకులు, హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీలు కస్టమర్లకు రక రకాల ఆఫర్లు ప్రకటించాయి. ఇది పండుగ సీజన్ కనుక వివిధ బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే హౌసింగ్ లోన్స్ ని ఇవ్వడం జరుగుతోంది.

మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ 7% వడ్డీతో 20 సంవత్సరాల వ్యవధికి తీసుకున్నట్టు భావిస్తే.. మీరు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.38,765 అవుతుంది. అయితే లోన్ బదిలీ ద్వారా వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్లు తగ్గితే.. మీ ఈఎంఐ వ్యవధి 240 నెలల నుంచి 229 నెలలకు తగ్గుతుంది. ఇది ఇలా ఉంటే వడ్డీ రేటు అర శాతం తగ్గితే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ వ్యవధి 222 నెలలవుతుంది.

7% వడ్డీ రేటుతో మీరు చెల్లించే వడ్డీ మొత్తం రూ.43.04 లక్షలు, అదే 6.7% వడ్డీ అయితే మీరు చెల్లించే వడ్డీ రూ.38.67 లక్షలు అవుతుంది. వడ్డీ రేటు 6.5% అయితే మీరు చెల్లించే వడ్డీ మొత్తం రూ.36.08 లక్షలు అవుతుంది. 7 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నవాళ్లు తక్కువే. ఎక్కువగా 9 శాతం వడ్డీతో లోన్ తీసుకున్నవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు ఇప్పుడు వడ్డీ తగ్గించుకుంటే రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదా అయ్యినట్టే.

 

Read more RELATED
Recommended to you

Latest news