అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడే వాళ్ళకి కొన్ని చిట్కాలు.. !!

-

చాలామంది ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్లాలన్న చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో, వాటికి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకోండి. హ్యూమన్ బ్లాడర్ అనేది మూత్రాన్ని బాత్రూంను విసిట్ చేసే వరకు స్టోర్ చేయగలుగుతుంది. రోజుకు నాలుగు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన జరగడం సాధారణమే. కానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ సమస్యలో శరీరం మూత్రవిసర్జన అనే ప్రక్రియపై నియంత్రణ కోల్పోతుంది. మూత్రాన్ని ఆపుకోలేకపోవడం వల్ల సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాలిసిన పరిస్థితి వస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌, ఒక టేబుల్ స్పూన్ రా హనీ ల‌ను వెచ్చ‌టి నీటితో క‌లిపి రోజుకు రెండు సార్లు దీన్ని తాగాలి. స్నానం చేసే నీటిలో ఒకటి లేదా రెండు కప్పుల ఆపిల్ సిడర్ వెనిగర్‌ను క‌లిపి, ఒక 15 లేదా 20 నిమిషాల త‌ర్వాత స్నానం చెయ్య‌డం ద్వారా మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మీ కండిషన్ మెరుగయ్యేవరకు దీన్ని రోజుకు ఒక్కసారి పాటించాలి.
అలాగే ఒక హాట్ బాటిల్ ను టవల్ తో చుట్టండి. వెల్లకిలా పడుకుని బ్లాడర్ పై మ‌ర్ద‌నా చేస్తున్న‌ట్లుగా కొంతసేపు ఉంచండి.. అలా అవసరమైనంత వరకు రిపీట్ చేయండి.

కెగెల్ ఎక్సర్సైజేస్ చేయడం వల్ల ఫ్రీక్వెంట్ యురినేషన్ సమస్యను త‌రిమికొట్ట‌వ‌చ్చు. రోజుకు ఒక‌సారి ఈ వ్యాయామం చేస్తే మంచి ఫ‌లితం పొంద‌వ‌చ్చు. నిత్యం ఇలా చేస్తూ ఉండడం వల్ల సమస్య తగ్గుతుంది.

ఓవరాక్టివ్ బ్లాడర్ సిండ్రోమ్ ను కంట్రోల్ చేయడానికి ఆక్యుపంక్చర్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ చైనీస్ టెక్నీక్ లో ఆక్యుపంక్చర్ ప్రాక్టీషనర్స్ అనేవారు చాలా సన్నటి, డిస్పోజబుల్ నీడిల్స్ ను శరీరంలోని కొన్ని ఆక్యుపంక్చర్ పాయింట్స్ వద్ద ఇన్సర్ట్ చేస్తారు. ఐతే, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ వద్దే ఆక్యుపంక్చర్ చికిత్సను చేయించుకోవాలి. స్వంతంగా ఆక్యుపంక్చర్ ను ఎట్టిపరిస్థితులలో ప్రయత్నించవద్దు. అంతేకాకుండా ఉసిరికాయ అనేది యూరినరీ హెల్త్ కు ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది యూరిన్ లోని ఎసిడిటీని పెంచుతుంది. దాంతో, ఇన్ఫెక్షన్ ను కలిగించే బాక్టీరియాను నశింపచేస్తుంది. ఉసిరికాయ రసంలో ఒక టీ స్పూన్ తేనెను మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవాలి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచిది. అంతేకాకుండా కొన్ని ఆహారపదార్థాలు బ్లాడర్ ను ఓవరాక్టివ్ చేస్తాయి. కెఫెయిన్ డ్రింక్స్, సిట్రస్ ఫ్రూట్స్ అలాగే జ్యూసెస్, సోడా అలాగే కార్బోనేటేడ్ బెవెరేజెస్, చాకొలేట్, స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్ ను తాగడం తగ్గించాలి. ఓవరాక్టివ్ బ్లాడర్ సమస్య ఉన్నట్టయితే ఫ్లూయిడ్స్ ను తగ్గించాలని అనుకోకూడదు. ఫ్లూయిడ్స్ ను రోజంతా తీసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version