ఈ లక్షణాలు ఉంటే.. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టే.. ఇంటి వైద్యంతో ఇలా చెక్ పెట్టొచ్చు..!

-

కిడ్నీలో రాళ్లుపడటం అనేది ఈరోజుల్లో చాలా కామెన్ ప్రాబ్లమ్ అయిపోయింది. వినటానికి పెద్ద సమస్యలా ఉన్న..అంత హైరానా పడాల్సిన అవసరం లేదు..అయితే చిన్న వయసులోనే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల దీర్ఘకాలంలో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మూత్రపిండంలో కొన్ని రకాల రసాయన సమ్మేళనాలు గట్టిపడి రాళ్లుగా మారుతాయి. వీటివల్ల మూత్ర విసర్జన సమసయంలో విపరీతమైన నొప్పి, పొత్తికడుపు నొప్పి, వికారం వంటివి వేధిస్తాయి

kidney
kidney

కిడ్నీలో ఏదైనా సమస్య ఉంటే, అది శరీరంలోని ఇతర భాగాలను కూడా బాగా ప్రభావితం చేస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి వాటితో పాటు కిడ్నీ స్టోన్స్ వంటి సమస్యలతో ఇబ్బందులు తప్పవు. వీటికి ముఖ్యకారణాలుు..మంచి నీళ్లు ఎక్కువగా తాగకపోవడం, కొన్ని రకాల మందుల వాడకం, దీర్ఘకాలం డీ హైడ్రేషన్ బారిన పడటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

రాళ్లు చిన్నవిగా ఉంటే మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. కానీ ఇవి పెద్దగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది. సమస్య వచ్చిన తరువాత ఇబ్బందులు ఎదుర్కోవడానికి బదులుగా ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉండవచ్చు.

లక్షణాలు ఇలా ఉంటాయి:

పొత్తికడుపు, వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
విపరీతంగా వాంతులు అవుతుంటాయి.
వికారంగా అనిపిస్తుంటుంది.
మూత్ర విసర్జన చేసేటప్పుడు రక్తం పడవచ్చు.
యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రంలో తీవ్రమైన మంట వస్తుంది.
జ్వరం కూడా వస్తుంది. అకస్మాత్తుగా చెమటలు పట్టడం ప్రారంభమవుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి, మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఆహారంలో సోడియం మొత్తాన్ని చేర్చాలి. ఎక్కువ విత్తనాలు ఉన్న పండ్లు, కూరగాయల వినియోగాన్ని తగ్గించాలి.

ఇంటి చిట్కాలు:

అన్నిటికన్నా ముఖ్యంగా తులసి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది అనేక శారీరక సమస్యలను దూరం చేస్తుంది. కషాయాలను కూడా తయారు చేసి తాగవచ్చు. తులసిలో విటమిన్ బి ఉంటుంది. ఇది రాళ్ల సమస్యను దూరం చేస్తుంది.

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తులసి నమిలితే, కిడ్నీ స్టోన్ కరిగి శరీరం నుంచి బయటకు వస్తుంది.
ఉల్లిపాయను పచ్చిగా తినాలి. దీని రసాన్ని రోజూ 1-2 టీస్పూన్లు తాగుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు.
ద్రాక్షలో పొటాషియం, నీరు ఎక్కువగా ఉంటుంది. సోడియం క్లోరైడ్ చాలా తక్కువగా ఉంటుంది.
జామకాయ తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

ఈ చిట్కాలతో సమస్య పరిష్కరించుకోవచ్చు. అయితే అన్నిసార్లు ఈ చిట్కాలు పనిచేయవు. సమస్య తీవ్రత ఎక్కువ ఉంటే..వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. తొలిదశలోనే చిట్కాలు పాటించగలరు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news