అన్ వాంటెడ్ హెయిర్ తొలగిపోవాలా..? అయితే ఇలా చెయ్యండి..!

చాలా మంది ముఖం పైన అన్ వాంటెడ్ హెయిర్ ఉంటుంది. ఇది వాళ్ళ అందాన్ని పాడు చేస్తుంది. అందుకని తొలగించుకోవాలని చూస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాని ట్రై చేయండి. ఎర్ర కందిపప్పుని మీరు స్క్రబ్ లాగ వాడితే కచ్చితంగా ఈ హెయిర్ అనేది పోతుంది రంధ్రాలు కూడా తగ్గుతాయి.

స్క్రబ్ చేయడం వలన చర్మంపై ట్యాన్ కూడా పోతుంది చర్మం కాంతివంతంగా మారుతుంది. పచ్చి పాలల్లో కొంచెం ఎర్ర కందిపప్పు వేసి నానబెట్టండి. ఆ తర్వాత దీనిని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా తయారైన పేస్ట్ ని క్లీన్ ఫేస్ మీద అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత కొద్దిగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి ఇలా చేస్తే అన్ వాంటెడ్ హెయిర్ అంతా కూడా పోతుంది.

ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది అదేంటంటే.. ఎర్ర కందిపప్పు పొడిలో కొంచెం పాలు, బాదం నూనె వేసి ముఖానికి అప్లై చేసుకోండి ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా ఈ విధంగా మీరు అప్లై చేయడం వలన అన్ వాంటెడ్ హెయిర్ తొలగిపోతుంది. లేదంటే పప్పుని మెత్తగా మిక్సీ పట్టి కొంచెం పాలు, కొంచెం కొబ్బరి నూనె వేసి ముఖానికి అప్లై చేసుకుని స్క్రబ్ లాగ రుద్దుతూ క్లీన్ చేసుకుంటే కూడా ఈ హెయిర్ మొత్తం పోతుంది అంతేకాదు పప్పు పొడిలో కొంచెం చందనం పొడి కలిపి మీరు ఈ హెయిర్ పైన రాసి 20 నిమిషాల తర్వాత గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేసి క్లీన్ చేసుకోండి ఇలా చేస్తే అన్వాంటెడ్ హెయిర్ మొత్తం పోతుంది.