కరోనా వైర‌స్‌కు హోమియోపతి మందు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్నే కరోనా వైరస్ భయపెడుతోంది. జలుబు చేస్తే చాలు కరోనా వైరస్ అని భయపడే పరిస్థితి వచ్చింది. శ్వాస ఇబ్బందులు తీవ్రం అయ్యేలా చేసే ఈ వైరస్‌ను మొదట వుహాన్ నగరంలో గుర్తించారు. వేగంగా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌కు న్యుమోనియా లాంటి లక్షణాలు ఉంటాయి. చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌కు చేరింది. ఈ వైరస్‌కు సంబంధించిన తొలి కేసు కేరళలో నమోదయిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్ప‌టికే కరోనావైరస్ వల్ల చైనాలో వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణాంతక కరోనాకు హోమియోపతి, యునాని మందులు బాగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సెంట్రల్​ కౌన్సిల్​ ఫర్​ రీసెర్చ్​ ఇన్​ హోమియోపతి సైంటిఫిక్​ అడ్వైజరీ బోర్డు సమావేశం తర్వాత ఆయుష్​ ఈ ప్రకటన చేసింది. ఆర్సినికం ఆల్బమ్​ 30 అనే మందు కరోనాపై బాగా పనిచేస్తుందని, పరగడుపుతో మూడు రోజుల పాటు తీసుకుంటే కరోనా వైరస్​ సోకకుండా నియంత్రించవచ్చని తెలిపింది. మరో నెల తర్వాత సేమ్​ డోస్​ను తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయని చెప్పింది. కొన్ని ఆయుర్వేదిక్​ మందులు, యునాని డికాక్షన్లు, ఇంటి ఔషధాలూ మెరుగ్గా పనిచేస్తాయని చెప్పింది.