హాన‌ర్ మ్యాజిక్‌బుక్ 15 ల్యాప్‌టాప్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు హువావే త‌న హాన‌ర్ బ్రాండ్ పేరిట భార‌త్‌లో తొలి ల్యాప్‌టాప్‌ను విడుద‌ల చేసింది. హాన‌ర్ మ్యాజిక్‌బుక్ 15 పేరిట స‌ద‌రు ల్యాప్‌టాప్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తోంది. ఇందులో 15.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. పాప‌ప్‌ వెబ్‌కెమెరాను అందిస్తున్నారు. ఫింగ‌ర్‌ప్రింట్ ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ల్యాప్‌టాప్ వేగంగా లోడ్ అవుతుంది. ల్యాప్‌టాప్ వేగంగా ప‌నిచేస్తుంది.

హాన‌ర్ మ్యాజిక్‌బుక్ 15 స్పెసిఫికేష‌న్లు…

* 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఏఎండీ రైజెన్ 5 3500యు మొబైల్ ప్రాసెస‌ర్‌, రేడియాన్ వెగా 8 గ్రాఫిక్స్
* 8జీబీ డీడీఆర్‌4 ర్యామ్‌, 256జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 ఓఎస్
*3.5 ఎంఎం ఆడియో జాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ ప‌వ‌ర్ బ‌ట‌న్‌, పాప‌ప్ వెబ్‌క్యామ్
* మ్యాజిక్ లింక్ 2.0, డ్యుయ‌ల్ బ్యాండ్‌వైఫై, బ్లూటూత్ 5.0
* యూఎస్‌బీ టైప్ సి, హెచ్‌డీఎంఐ, 42 వాట అవ‌ర్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

హాన‌ర్ మ్యాజిక్‌బుక్ 15 ల్యాప్‌టాప్ స్పేస్ గ్రే, మిస్టిక్ సిల్వ‌ర్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. రూ.42,990 ధ‌ర‌కు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో ఆగ‌స్టు 6 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. దీనిపై లాంచింగ్ ఆఫ‌ర్ కింద కొన్ని రోజుల పాటు రూ.3వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల కేవ‌లం రూ.39,990 ధ‌ర‌కే దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. 12 నెల‌ల పాటు నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు. పాత ల్యాప్‌టాప్‌ల‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.13వేల వ‌ర‌కు ధ‌ర పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version