‘కల్కి’ నుంచి ‘హోప్ ఆఫ్ శంభల’ వీడియో సాంగ్ రిలీజ్

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోన్న ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే…’కల్కి’ నుంచి ‘హోప్ ఆఫ్ శంభల’ సాంగ్ ఫుల్ వీడియో రిలీజైంది. రామజోగయ్య రాతలకు సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ తోడవడంతో ఈ సాంగ్ మనసుకు హత్తుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాను అశ్వనీ దత్ నిర్మించగా.. సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news