హోటల్ లీలా ప్యాలస్.. ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్ బ్రాండ్ గా రికార్డు.

ఆతిథ్య రంగంలో అంతులేని విజయాన్ని అందుకున్న లీలా ప్యాలస్ హోటల్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫారెన్ దేశాల్లో ఉన్న హోటళ్ళను పక్కకు నెట్టి భారత హోటల్ బ్రాండ్ అద్భుతమైన అవార్డును సొంతం చేసుకుంది. ఇండియాలోని హోటల్ లీలా ప్యాలస్ హోటల్ కి ప్రపంచంలోని అత్యుత్తమైన పురస్కారం లభించింది. ట్రావెల్ ప్లస్ లీజర్ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం లీలా ప్యాలస్ హోటల్ బ్రాండ్ కు దక్కింది. ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్ బ్రాండ్ గా లీలా ప్యాలస్ నిలిచింది.

అత్యుత్తమ హోటల్ బ్రాండ్ గా ట్రావెల్ ప్లస్ లీజర్ నుండి అవార్డు అందుకోవడం ఇది వరుసగా రెండవ సారి. ప్రపంచంలోని అత్యుత్తమ హొటళ్ళని తలదన్నే రీతిలో నిర్మాణం, అంతర నిర్మాణం, వాస్తుకళ, శిల్పకళ, రాజభవాన్ని తలపించే నిర్మాణాలతో పాటు అద్భుతమైన ఆతిధ్యం హోటల్ లీలా ప్యాలస్ కు ఈ అవార్డును తెచ్చిపెట్టాయి. దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో హోటల్ బ్రాండ్ లీలా ప్యాలస్ ఆతిధ్య సేవలు అందిస్తుంది.