కాలేజ్‌లో, ఆఫీసుల్లో పొట్టి పొట్టి అని పిలుస్తున్నారా? అందరూ అలా పిలుస్తుంటే మీకు మీరే పొట్టిగా కనిపిస్తున్నారా? మరేం బెంగపెట్టుకోకండి. పొడవుగా ఉన్నవారి కంటే పొట్టిగా ఉన్నవారే అందంగా ఉంటారన్న విషయం మర్చిపోవద్దు. అయినా కొంచెం పొడవుగా కనిపిస్తే బాగుండు అనుకునే వారు కొన్ని పాటిస్తే ఆ ముచ్చట కూడా తీరుతుంది. అదెలాగో మీరే చదివి తెలుసుకోండి.
పొట్టిగా ఉన్నారని బాధపడకండి. అదొక వరంలా మార్చుకోండి. పొట్టిగా ఉన్నవారు పొడవుగా కనిపించడానికి చాలా మార్గాలున్నాయి. పొడవుగా ఉన్నవారు పొట్టిగా కనిపించడానికి ఎలాంటి మార్గం లేనందుకు సంతోషించండి. పొడవుగా కనిపించేందుకు మార్గాలేంటో తెలుసుకోండి.
– సాధారణంగా మనిషి హైట్ అనేది జీన్స్ పరంగా వస్తుంది. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలూ అలానే ఉంటారు. ఈ విషయంలో చేసేదేం లేదు. వంగడం వల్ల ఇంకా పొట్టిగా కనబడుతారు. హైట్ లేమని బాధపడే వారు నిటారుగా నిలబడడం, కూర్చోవడం వల్ల పొడుగ్గా కనిపిస్తారు. వంగడం వల్ల పొట్టిగా కనిపిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
– కొన్ని దుస్తులలో కూడా పొడుగ్గా కనిపించడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా గళ్ల డిజైన్లు, చెక్స్ ఉన్న దుస్తులు ఉన్న పొడువు కంటే ఇంకా పొట్టిగా కనిపించేలా చేస్తాయి. రంగురంగుల కాకుండా ఒకే కలర్ ఉండే డ్రెస్ వేసుకోవడం వల్ల పొడుగుగా కపవపడవచ్చు. అడ్డంగా ఉండే డిజైన్లు కాకుండా నిటారుగా ఉండే డిజైన్లు పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.
– చాలామంది గాలి వీచేందుకు వీలుగా వదులు బట్టలు ధరిస్తారు. దీంతో వీరు మరింత పొట్టిగా కనిపిస్తారు. బిగుతు దుస్తులు వేసుకోవడం వల్ల హైట్ ఉన్నట్లుగా కనిపిస్తారు. ముఖ్యంగా టీషర్టు, జీన్స్ విషయంలో బిగుతుగా ఉన్నవి ధరిస్తే పొడవుగా కనిపిస్తారు.
– జీన్స్‌గానీ మరే ఇతర ప్యాంట్లు వేసుకుంటే దాని చివరలు ఓపెన్‌గా ఉండేవి కాకుండా బిగుతుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ప్యాంటు వెనుక పాదాల పైభాగం వరకు ఉంటే ఇంకా పొడవుగా కనిపించవచ్చు.
– పొట్టిగా ఉన్నారని ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకూడదు. పొట్టిగా ఉన్నామనే భావన మనసులోంచి తీసేయాలి. తల నిటారుగా పెట్టి నడవడం వల్ల కూడా హైట్ ఉన్నామనే భావనను ఎదుటి వారిలో తీసుకురాగలుగుతారు. వీటన్నిటి కంటే బెటర్ ఆప్షన్ హై హీల్స్ వాడడం.
– కాకపోతే హైహీల్స్ పాదాలకు అంత మంచిది కాదు. అప్పుడప్పుడు అయితే సరిపోతాయి కానీ డైలీవేర్‌కు ఇవి వాడకపోవడమే మంచిది.