దీపావళికి ‘దీపాల పండుగ’ అని పేరు ఎలా వచ్చింది..?

-

దీపావళి.. లక్ష్మీప్రదమైన పండుగగా పేరు దీనికి. ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు పెద్ద ఎత్తున దీన్ని జరుపుకొంటారు. ఈ పండుగ మతభేదాలు లేకుండా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ పూజ చేసి రాక్షసుల బాధలు తొలగిన ఆనందాన్ని వ్యక్తపరచుటకై దీపాలంకరాలు చేసి టపాసులు కాలుస్తారు. అసలు దీపావళి అంటే దీపాల పండుగ అని పేరు ఎలా వచ్చింది..?, అసలు దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఎప్పటి నుండో మనం దీపావళి పండుగను చేసుకుంటున్నాము. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళి కూడా ఒకటి. అయితే చాలా మందికి దీని అర్ధం ఏమిటి అనేది తెలీదు. దీపావళి అంటే దీపముల వరస అని అర్ధం. అందుకే ఈ పేరు వచ్చింది.

దీపావళి నాడు మనం ఖచ్చితంగా దీపాలను వెలిగిస్తాము. ఈ దీపాలు చీకటితొలగించి వెల్తూరిని ఇస్తాయి. చెడు పైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని చేసుకుంటారు.

ఇక ఈ ఏడాది పండుగ ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వచ్చింది. అయితే అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుందిట.

దీపావళి నాడు ఇలా చేస్తే మంచిదట:

దీపాలను వెలిగిస్తే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది.
దీపావళినాడు గంటలతో డెకరేషన్ చేస్తే చాలా బాగుంటుంది పైగా పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. గంటల శబ్దం మంచి వైబ్రేషన్స్ ని తీసుకు వస్తాయి కూడా.
అలానే దీపావళి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. చక్కగా పాజిటివ్ ఎనర్జీ కలిగేలా చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news