కేరళ విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 17 కి పెరిగింది. ఇద్దరు పైలట్లు చనిపోయారు, మొత్తం నలుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. గాయపడిన వారిని మలప్పురం & కోజికోడ్ ఆసుపత్రులలో చేర్చారు. ఇదిలా ఉంటే… ప్రయాణీకులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ మానవతా సహాయం అందించడానికి గానూ దేశ రాజధాని ఢిల్లీ నుంచి రెండు మరియు ముంబై నుండి ఒక ప్రత్యేక సహాయ విమానాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి గానూ ఏఏఐబీ, డీజీసిఏ మరియు విమాన భద్రతా విభాగాలు చేరుకున్నాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై దృష్టి సారించింది. కొంత మంది ప్రయాణికుల ఆరోగ్యం విషమంగా ఉంది అని తెలుస్తుంది. వారిని అవసరం అయితే ఢిల్లీ తరలించి చికిత్స అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.