పసిడి ధర పరుగులు పెడుతుంది.. అల్ టీం రికార్డు స్థాయి నుంచి ఇంకా పై పైకే దూసుకుపోతుంది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.810 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.59,130 కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.54,200కి పెరిగింది. అలాగే వెండి ధర కూడా భారీగా పెరిగిపోయింది.
కేజీ వెండి ధర రూ.3010 పెరిగిపోయింది. దీంతో ధర రూ.76,510కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మార్కెట్‌లో రూ.700 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,050 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,750కి చేరింది. కేజీ వెండి ధర రూ.3010 పెరుగుదలతో రూ.76,510 కు చేరింది.