ఇప్పుడు దేశ వ్యాప్తంగా అడవి జంతువుల మరణాలపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అడవి జంతువులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రజలను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చత్తీస్ఘడ్ లో ఒక అడవిలో రోజుల వ్యవధిలో మూడు ఏనుగులు మరణించాయి. దీనితో అవి ఏ విధంగా చనిపోతున్నాయి అనేది ఎవరికి అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్‌గుజా అడవుల్లో మూడు రోజుల్లో మూడు ఏనుగులు మరణించాయి. బలరాంపూర్ జిల్లాలోని రాజ్‌పూర్ అడవుల్లో ఇప్పటికే రెండు ఏనుగులు మరణించగా అందులో ఒక ఏనుగు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. అసలు గర్భంతో ఉన్న ఏనుగు ఏ విధంగా మరణించింది అనేది అధికారులకు అర్ధం కావడం లేదు. మొదటి రెండు ఏనుగుల పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు వచ్చాయి.
అవి విషం తీసుకోవడంతో మరణించాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇక ఏనుగుల మరణం పై అధికారులు స్పందిస్తూ ఈ ఏనుగుల మంద రాజ్‌పూర్ అడవులకు దగ్గర్లో ఉన్న ఓ గ్రామానికి వెళ్లి ఇళ్లను ధ్వంసం చేశాయని… అక్కడ మహువా పువ్వులను ఎక్కువగా తినడంతో ప్రాణాలు కోల్పోయాయి అని అంటున్నారు. ఇళ్ళల్లో ఉంచిన యూరియాను కూడా తిన్నాయి అని అధికారులు పేర్కొన్నారు.