56వేల ఏళ్ల పురాత‌న‌మైన స‌రస్సు.. రాత్రికి రాత్రే పింక్ రంగులోకి మారింది..!

-

మ‌హారాష్ట్ర‌లోని బుల్ధానా జిల్లాలో ఉన్న లోనార్ అన‌బ‌డే 56వేల ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఓ స‌రస్సు రాత్రికి రాత్రే పింక్ రంగులోకి మారింది. దీంతో ఈ విష‌యం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఆ స‌రస్సు విస్తీర్ణం 77.69 హెక్టార్లు కాగా అది ఉన్న లోనార్ శాంక్చువ‌రీ విస్తీర్ణం 3.66 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు.

this lake in maharashtra turned into pink overnight

కాగా ఈ విష‌యంపై అట‌వీ శాఖ నిపుణులు స్పందిస్తూ.. తాము ఈ విధంగా చూడ‌డం ఇదే మొద‌టి సార‌ని, ప్ర‌స్తుతం ఆ స‌రస్సుకు సంబంధించిన శాంపిల్స్‌ను నాగ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI), పూణెలోని అగార్క‌ర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ల‌కు ప‌రిశోధ‌న‌ల నిమిత్తం పంపామ‌ని.. వారు ఆ శాంపిల్స్‌ను ప‌రీక్షించి.. ఆ స‌రస్సు రాత్రికి రాత్రే పింక్ రంగులోకి ఎందుకు మారిందో క‌నుక్కుంటార‌ని.. తెలిపారు.

అయితే స‌రస్సులో ఆల్గే ఉండ‌డం వ‌ల్ల కొన్ని సార్లు ఇలా పింక్ రంగులోకి నీరు మారుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. ఇక ఇరాన్‌లోని ఉమ్రియా స‌రస్సులోనూ స‌రిగ్గా ఇదే త‌ర‌హాలో ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. అందులోని నీరు పింక్ రంగులోకి మార‌లేదు కానీ.. ఆ స‌ర‌స్సులోని నీరు రాత్రికి రాత్రే ఉప్ప‌గా మారింది. అది కూడా ఆల్గే ప్ర‌భావ‌మేన‌ని ప‌లువురు నిపుణులు తెలిపారు. అయితే కొన్నిసార్లు ఆల్గే వ‌ల్ల నీరు ఎర్ర‌గా కూడా మారుతుంద‌ని, కానీ వ‌ర్షాలు ప‌డితే తిరిగి ప‌రిస్థితి య‌థాత‌థంగా మారుతుందని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఆ స‌రస్సు పింక్ రంగులోకి మారినా అందులోని నీరు హానిక‌రం కాద‌ని, కానీ ఆ నీటిపై ప‌రిశోధ‌న‌లు మాత్రం క‌చ్చితంగా చేయాల్సిందేన‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news