బ్రహ్మాస్త్రం ఫస్ట్ రివ్యూ ఎలా ఉందంటే..?

-

తాజాగా నాగార్జున, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో రన్బీర్ కపూర్ హీరోగా ఆయన భార్య అలియా భట్ హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ సినిమా ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. బ్రహ్మాస్త్ర హిందీ సినిమాలు తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తుండగా.. భారీ స్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇకపోతే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం భారీగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ రివ్యూ విడుదలయ్యింది.

ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు ఈ సినిమాకు సంబంధించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ హై విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చాలా అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇక సినిమా ఆటోగ్రఫీ కూడా కనుల విందుగా ఉంది. కొన్ని సీన్స్ లో లైటింగ్ మరీ డార్క్ గా ఉందని ఉమైర్ సందు తెలిపాడు. స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని ప్రొడక్షన్ డిజైనింగ్ మాత్రం చాలా బాగా ఉందని ఉమైర్ సందు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్స్లోని కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయి. ఇక మ్యూజిక్ పెద్దగా ఏమనిపించలేదు. ఇక మొత్తంగా ఈ సినిమాలో మ్యూజిక్ కి 2.5 రేటింగ్ మాత్రమే ఇస్తాను.

రణ్ బీర్ కపూర్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించినా.. అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేశాడు అంటూ ఉమైర్ సందు కామెంట్లు చేశారు. ఇక మౌని రాయ్ నాగిని మోడ్ లో ఉందని ,అమితాబ్ మనసు దోచుకున్నారు అని , ఇక ఈ సినిమాలో ఆత్మ మిస్ అయిందని, అలియా భట్ క్యూట్ గా కనిపించిందని తెలిపారు. ఇకపోతే ఈ సినిమా ఆశించని స్థాయిలో వసూల్లను రాబడుతుంది అనే విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేయలేను అంటూ తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news