రాహుల్ గాంధీకి పదవుల మీద ఆశ లేదన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సెప్టెంబర్ 7 ప్రతిష్టాత్మక దినమని.. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన దినం అని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమౌతుందన్నారు. రాహుల్ గాంధీ దేశం కోసం పాటు పడుతున్న వ్యక్తి అంటూ కొనియాడారు. దేశాన్ని ఒక్కటిగా అఖండం గా ఉంచడానికి పోరాడుతున్నారని అన్నారు.
కులాలు,మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు విభిన్న తత్వాలు ఉన్న భారత దేశం ఒక్కటే అని చెప్పే ఉద్దేశం తో 3500 కిలో మీటర్లు నడిచే సహోసో పేత ఉద్యమమన్నారు. తెలంగాణలో మక్తల్ నుంచి జుక్కల్ వరకు 13 రోజుల యాత్ర.. వివిధ ప్రాంతాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జిల్లాలు,ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.