ధమాకా సినిమా ఎలా ఉందంటే..!!

-

హీరో రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా.. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఇటీవల ఏ సినిమా విడుదలైన ప్రమోషన్ లే బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పైన బాగా బజ్ ఏర్పడింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా చేస్తూ ఉన్నారు. రవితేజ నటించిన గత చిత్రాలు రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడి సినిమాలు ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి.దీంతో రవితేజ కెరియర్ మరొకసారి డేంజర్ జోన్లు పడింది.

అయినా కూడా రవితేజ పట్టు వదలని విక్రమార్కుడుగా ఎన్నో సినిమాలను చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ధమాకా చిత్రంతో రవితేజ మొత్తం ఈ భారాన్ని తన భుజాల మీదే వేసుకొని మోసారని చెప్పవచ్చు. రవితేజ కామెడీ టైమింగ్ .. యాక్షన్ ఎపిసోడ్లు అన్నీ చూస్తుంటే.. రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ధమాకా సినిమా ఈరోజు విడుదల అయింది ఈ సినిమా స్టోరీ రొటీన్ గానే ఉన్న రవితేజ ఎనర్జిటిక్ తో ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్గా మార్చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులోని కామెడీ, పాటలు ఇలా అన్ని అంశాలు కూడా ఫస్ట్ ఆఫ్ ని ఆసక్తికరంగా మార్చేశాయని కొంతమంది నెటిజన్స్ ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గతంలో నటించిన బలుపు, మిరపకాయ్, వెంకీ వంటి చిత్రాలలో ఎలా నటించారో.. ఈ చిత్రంలో కూడా అలానే నటించారని కామెంట్లు తెలియజేస్తున్నారు. మరికొంతమంది ధమాకా చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా రావు రమేష్ కామెడీ, లిప్ లాక్ సన్నివేశాలు ఈ చిత్రానికి మరింత ఆకర్షణంగా నిలుస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీ లీలా నటన డాన్స్ ,కామెడీ టైమింగ్ ప్లస్ అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరి కలెక్షన్ల పరంగా ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news