నీళ్లను పదే పదే వేడి చేసి తాగుతున్నారా..? అయితే డేంజరే..

-

మంచి పనే అయినా.. కొన్నిసార్లు అది మనకు హాని చేస్తుంది. నీళ్లను వేడి చేసుకోని తాగడం ఆరోగ్యానికి మంచిదంటారు.. కానీ ఒకసారి వేడి చేసిన నీటిని పదే పదే వేడి చేసి తాగడం మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏమైతది వేడి చేస్తే.. క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి కదా..? మంచిదే కదా..? మరి వైద్యులు ఎందుకు ఇలా అంటున్నారు అనుకుంటున్నారా..?
నీటిని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని లవణాల సంఖ్య పెరిగిపోతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నీటిలో అనేక లవణాలు ఉంటాయి. అందులో నైట్రేట్స్ అనేది ఒక లవణం..కరిగే గుణం కలిగిన ఇది సాధారణంగా హానికరం కాదు. అయితే ఎక్కువ సేపు నీటిని వేడి చేస్తే మాత్రం అవి విషపూరితం అవుతాయి. క్యాన్సర్, లుకేమియా, నాన్ హాడ్కిన్ లింఫోమా వంటి ప్రమాదకరమైన, ప్రాణాంతక వ్యాధులకి కారణం కావచ్చు.
ఆర్సేనిక్: ఇది తక్కువ మొత్తంలో ఉంటే హానికరం కాదు. పంపు నీటిలో దీని పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆర్సెనిక్ క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు, మానసిక రుగ్మతలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో ఆర్సెనిక్ ఉన్న నీటిని తాగితే అది ప్రసరణ వ్యవస్థతో పాటు చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది.
ఫ్లోరైడ్: పంపు నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, నొప్పులు వంటి రుగ్మతల వచ్చే ప్రమాదం ఎక్కువ. చిన్న పిల్లల్లో అధిక ఫ్లోరైడ్ వినియోగం వల్ల దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది.
కాల్షియం: ఎముకలకి కాల్షియం అవసరం. కానీ నీళ్ళని మరిగించడం వల్ల అందులోని కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఇది మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళని కలిగిస్తుంది.
లెడ్: సీసం నీటి నుంచి రాదు. ఇది పాత పైపుల నుంచి నీటిలోకి చేరి కలుషితం అవుతుంది. సీసం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు వస్తాయి.
నీళ్ళు ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల కలిగే అనార్థాలు..
సాధారణంగా మంచి నీటిని వేడి చేసేటప్పుడు గ్యాస్ బుడగలు ఉంటాయి. ఇవి మరిగించే సమయంలో న్యూక్లియేషన్ సైట్‌గా పని చేస్తాయి. మళ్ళీ అవే నీటిని వేడి చేయడం వల్ల నీటిలో కరిగిన వాయువులు బయటకి పంపుతుంది. అంతే కాదు వాటి రుచి కూడా మారిపోతుంది. వేడి చేసిన నీటితో తయారు చేసే ఆహారం, పానీయాల రుచిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒక్కసారి వేడి చేసిన నీటిని పొరపాటున కూడా మళ్లీ వేడిచేయొద్దు..

Read more RELATED
Recommended to you

Latest news