కోడిగుడ్డు బాగా ఉడకాలంటే సరిగ్గా ఎంత సమయం పడుతుంది..?

-

రోజు కనీసం ఒక్క గుడ్డును అయినా తినమని వైద్యుల నుంచి అధికారుల వరకూ అందరూ చెప్తున్నారు. గుడ్డును ఉడికించుకోని తిన్నప్పుడే అందులోని పోషకాలను అన్నీ మనం గ్రహించుకోగలుగుతాం..గుడ్డు ఉడ‌కించుకుని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇలా తిన‌డం వ‌ల్ల గుడ్డులోని పోష‌కాలు అధికంగా మ‌న శ‌రీరానికి ల‌భిస్తాయి. అయితే గుడ్డును ఎంత సేపు ఉడికించుకుని తినాలి.. ఎంత సేపు ఓ పది నిమిషాలు ఉడికిస్తాం అది కూడా తెలియదా అనుకుంటున్నారా..? గుడ్డును ఉడికించేందుకు కూడా ఒక పద్ధతి ఉంటుందట.. ఎన్నో నిమిషంలో గుడ్డు పచ్చసొన ఉడుకుతుంది. ఏ నిమిషానికి గుడ్డు పూర్తిగా బాయిల్‌ అవుతుంది. ఒకవేళ మీకు ఆఫ్‌ బాయిల్‌ కావాలంటే.. కరెక్టుగా ఎప్పుడు ఆపాలి ఇవి చూద్దామా..!

గుడ్డును మ‌రీ ఎక్కువ సేపు ఉడికించ‌కూడ‌దు. దీనిని 10 నుండి 15 నిమిషాల వ‌ర‌కు ఉడికించాలి. ఇది కూడా మ‌నం ఉంచే మంట‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. గుడ్డులోని తెల్ల‌సొన ఉడికేందుకు దాదాపు 82 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త అవ‌స‌రం. అదే ప‌చ్చ‌సొన ఉడ‌కడానికి 76 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త అవ‌స‌ర‌మ‌వుతుంది.

గుడ్డును ఉడికించే కొద్ది దానిలో మార్పు వ‌స్తుంది. గుడ్డు ఉడికించ‌డం మొద‌లు పెట్టిన ఒక‌టి నుండి మూడు నిమిషాల వ‌ర‌కు అది ఇంకా ప‌చ్చిగానే ఉంటుంది. కానీ ప‌చ్చ‌సొన విడిపోయి ద్రవంగా మారుతుంది. తెల్ల సొన మాత్రం అలాగే జిగురుగా ఉంటుంది.

3 నుంచి 7 నిమిషాల్లో గుడ్డు ప‌చ్చ‌సొన గ‌ట్టిగా మారుతుంది. కానీ తెల్ల‌సొన ఇంకా ద్రవంగానే ఉంటుంది. 7 నుంచి 11 నిమిషాల్లో ప‌చ్చ‌సొన బాగా ఉడుకుతుంది. తెల్ల‌సొన గ‌ట్టిగా మారుతుంది. జిడ్డుగా కూడా ఉంటుంది.

11 నుండి 15 నిమిషాల్లో గుడ్డు బాగా ఉడుకుతుంది. తెల్ల ప‌చ్చ‌సొన‌లు రెండు గ‌ట్టిగా మారుతాయి. ఒక గుడ్డును పూర్తిగా ఉడికించ‌డానికి 13 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. ఉడికించిన గుడ్డు తినాల‌నుకునే వారు దానిని క‌నీసం 13 నిమిషాల పాటు ఉడికించి తినాలి.

ఈ విధంగా గుడ్డును ఉడికించి తిన‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news