ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని తెలిపారు. డిసెంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతున్నాయని ,పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం జరిగిందనివిమర్శించారు. ఇప్పుడు తప్పుడు కథనాలతో కొన్ని చానల్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
2020లో వరదలు రావడం వల్ల అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డాం దెబ్బతిన్నాయని తెలిపారు. యూఎస్ కెనడా నుంచి సైంటిస్టులు వచ్చి పోలవరాన్ని పరిశీలన చేసి ఒక రిపోర్ట్ ను ఇస్తారని ,రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు మూడు సీజన్లో పూర్తవుతుందో లేదో క్లారిటీ వస్తుందనితెలిపారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వైపు ఎవరిని కూడా అనుమతించలేదని విమర్శించారు.