దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటుగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నేడు తెలంగాణా హైకోర్ట్ లో దీనికి సంబంధించి విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ నియంత్రణ కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది అని డిహెచ్ కోర్ట్ కి వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కేసులు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి అని ఆయన తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 85 శాతం మంది బ్లాక్ ఫంగస్ రోగులు ఉన్నారు అని డీహెచ్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 ప్రయివేటు హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నాం అని ఆయన అన్నారు. బ్లాక్ ఫంగస్ లైఫో జోమల్ ,అంపో టెరిసిన్ -బి ఇంజెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని డిహెచ్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ మందుల ధర 3 వేలు వరకు ఉందని తెలిపారు.