ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి ఏదో వచ్చిందని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఏవో కుట్రలు ఉన్నాయని చెబుతున్నారన్న సీఎం.. ఎంతవరకు కరెక్టో తెలియదని చెప్పారు. ఇతర దేశాల వాళ్ళు కావాలనే మనదేశంలో అక్కడక్కడా క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.” ఆంధ్రోళ్ల అణచివేతలు అయిపోయినాయ్, ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్, తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్, జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్. ఒక్క వరదకే ఎన్ని కష్టాలు వచ్చినయ్ మన కేసీఆర్ దొరగారికి”. అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.
ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్,
ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్,
తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్,
జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది,
ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్.
ఒక్క వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ మన KCR దొర గారికి. pic.twitter.com/SWoDFFFjOq— YS Sharmila (@realyssharmila) July 18, 2022