మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో.. ఇలా తెలుసుకోవచ్చు..!

-

ఈ రోజుల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మోసగాళ్ల చేతిలో చిక్కుకోకుండా చూసుకోవడం కూడా కష్టమవుతుంది. సైబర్ మోసగాళ్లకు చేతుల్లో చిక్కారంటే ఎకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోవడం అనవసరంగా నేరాలలో ఇరుక్కోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది నకిలీ సిమ్ కార్డులు తీసుకుని రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇక తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇలా చేయండి.

 

విజయవాడకు చెందిన ఒక వ్యక్తి పేరుతో 658 సిమ్ కార్డులు యాక్టివ్ గా ఉన్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది అయితే అధికారులు ఈ సిమ్లన్నిటిని కూడా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలని టెలి కమ్యూనికేషన్ శాఖ ఆదేశించింది ఇక మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి అనేది చూసేయండి.

ఇందుకు మొదట మీరు సంచార్ సాతి అధికారిక వెబ్‌సైట్ https://sancharsaathi.gov.in/ ని ఓపెన్ చేయాలి
ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనపడతాయి. దీనిలో మీరు మొబైల్ నెంబర్ కనెక్షన్ తెలుసుకోండి(TAFCOP) మీద నొక్కండి.
కొత్త పేజీ ఓపెన్ అయ్యాక.. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరవాత క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసేయండి.
ఇక ఎన్ని మొబైల్ నంబర్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనది కానీ నెంబర్ ని మనం బ్లాక్ చేసేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news