సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్లు అంటే నాణ్యతకు, మన్నికకు పేరు. ఒక్కసారి ఐఫోన్‌ను కొనుగోలు చేస్తే అది ఏళ్ల తరబడి పనిచేస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక్క బ్యాటరీ సమస్య వస్తుంది. కనుక ఆ ఒక్కదాన్ని రీప్లేస్ చేస్తే ఏళ్లకు ఏళ్లు ఒక్క ఐఫోన్‌నే వాడవచ్చు. అయితే ఒక ఐఫోన్ ను తీసుకుంటే సహజంగా దాన్ని ఎన్ని ఏళ్ల వరకు వాడవచ్చు ? అందుకు ఒక కాల పరిమితి ఉంటుందా ? అంటే..
ఐఫోన్లను ఇన్ని ఏళ్ల పాటు వాడాలని రూల్ ఏమీ లేదు. నచ్చకపోతే ఎప్పటికప్పుడు మార్చేయవచ్చు. అది వారి స్థోమతపై ఆధార పడి ఉంటుంది. అయితే ఒక్కసారి ఐఫోన్ కొన్నాక దాన్ని చాలా మంది కొన్నేళ్ల పాటు వాడాలని అనుకుంటారు. ఈ క్రమంలో పలు సంస్థలు విశ్లేషించిన ప్రకారం ఒక్క ఐఫోన్ సహజంగానే 7 ఏళ్ల వరకు మన్నుతుంది. సరిగ్గా మెయింటెయిన్ చేయాలే గానీ ఒక ఐఫోన్‌ను 7 ఏళ్ల పాటు ఏకబిగిన ఉపయోగించవచ్చు. మధ్య మధ్యలో యాపిల్ కంపెనీ విడుదల చేసే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు.
అయితే 7 ఏళ్ల వరకు సహజంగా ఎవరూ ఒక్కటే ఐఫోన్‌ను వాడరు. కానీ 4 ఏళ్ల వరకు మాత్రం సులభంగా వాడవచ్చు. అప్పటి వరకు ఆ ఫోన్లలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే ఆ ఫోన్లు మరీ పాతబడవు. అన్ని యాప్స్‌కు సపోర్ట్ చేస్తాయి. కనుక ఎవరైనా సరే ఐఫోన్లను ఏళ్ల తరబడి ఉపయోగించాలనుకుంటే వాటిని 4, 5 ఏళ్ల వరకు ఏకబిగిన ఉపయోగించవచ్చు. ఎలాంటి సమస్యా ఉండదు. ఇంకా కావాలంటే ఇంకో ఏడాది కూడా.. అంటే 6 ఏళ్ల వరకు వాడవచ్చు. కానీ అప్పటి వరకు సాఫ్ట్‌వేర్లు, హార్డ్‌వేర్, యాప్‌లు మారిపోతాయి. కనుక ఎవరూ అంతకాలం ఐఫోన్లను వాడరనే చెప్పవచ్చు.