హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ని EPFO సభ్యులు ఎంచుకుంటే… ప్రతి నెలా ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా..?

-

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలా..? హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీని మే 3 వరకూ ఎక్స్టెండ్ చేసారు. దీనితో మీరు హయ్యర్ పెన్షన్ ని సెలెక్ట్ చెయ్యాలంటే ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఇక పూర్తి వివరాలని చూస్తే.. జీతం నుండి ప్రస్తుతం ఎంత డబ్బు కట్ అవుతుంది అనేది హయ్యర్ పెన్షన్ ఎంపికను ఎంచుకునే ముందు తప్పక తెలుసుకోవాలి.

EPF ఖాతాకు ఉద్యోగి తరపు కాంట్రిబ్యూషన్ లో బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ నుండి పన్నెండు శాతం కట్ అవుతుంది. అలానే ఎంప్లాయీస్ నుండి 12% జమ అవుతుంది. 8.33% EPSకి , 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్ లోకి వెళ్తాయి. అదే హయ్యర్ పెన్షన్‌ను సెలెక్ట్ చేస్తే బేసిక్ పేలో 8.33% EPSకి వెళ్ళవచ్చు. అలానే హయ్యర్ పెన్షన్ ని ఎంచుకుంటే EPFO మీ PF ఖాతా నుండి EPS మొత్తాన్ని తీసేస్తుంది.

ఎంత పెన్షన్ వస్తుంది..?

పెన్షనబుల్ జీతం X పెన్షనబుల్ సర్వీస్ / 70. ఇలా 25 సంవత్సరాలుగా ఉద్యోగంలో చేరి 58 సంవత్సరాల వయస్సు లో రిటైర్ అయితే 33 సంవత్సరాలు వర్క్ చేసినట్టు కదా జీతం రూ. 40,000 అయితే… ప్రతి నెలా పెన్షన్‌ రూ. 7071 [(రూ. 15000×33)/70] మీకు వస్తుంది. అదే హయ్యర్ పెన్షన్ అయితే రూ. 18,857 [(రూ. 40000×33)/70] వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news