మ్యూకోర్మైకోసెస్ రావడానికి గల కారణాలు ఇవే: AIIMS

-

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ స్టెరాయిడ్స్ ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల మ్యూకోర్మైకోసెస్ వస్తుందని అన్నారు. బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ని కూడా ముఖం మ్యూకోర్మైకోసెస్ అంటారని… మ్యూకోర్ ఫంగస్ కారణంగా ఇది వస్తుందని చెప్పారు. కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.

అనేక మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువవుతోంది. ఫంగస్ మరియు బ్యాక్టీరియా కారణంగా ఇవి వస్తాయి అని చెప్పారు. ఈ మ్యూకోర్మైకోసెస్ మట్టిలో, గాలిలో, ఆహారంలో ఉంటాయి. కానీ వాటిలో వైరస్ చాలా తక్కువగా ఉంటుందని మామూలుగా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాదు అని చెప్పారు.

కరోనా వైరస్ రాక ముందు బ్లాక్ ఫంగస్ కేసులు చాలా తక్కువ ఉండేవి. కానీ కరోనా కారణంగా ఆ కేసులు కూడా ఎక్కువైపోయాయి అని వెల్లడించారు.

బ్లాక్ ఫంగస్ వచ్చిన పేషంట్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు …?

24 మంది పేషెంట్స్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇందులో 20 మంది కరోనా పాజిటివ్ లో ఉన్నారు మిగిలిన వారికి కరోనా నెగిటివ్ వచ్చింది. చాలా రాష్ట్రాలలో 500 కంటే ఎక్కువ బ్లాక్
ఫంగస్ కేసులు నమోదయ్యాయి.

ఇది ముఖాన్ని బాగా ఎఫెక్ట్ చేస్తుందని ముక్కు కళ్ళు బ్రెయిన్ కి ఇబ్బందులు ఉంటాయని.. కళ్ళు కూడా సరిగ్గా కనిపించవని, ఊపిరితిత్తుల్లోకి కూడా ఇన్ఫెక్షన్ సోకుతుందని చెప్పారు. స్టెరాయిడ్స్ కారణంగానే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతోందని చెప్పడం జరిగింది. స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు తీసుకోకుండా ఉండటం మంచిదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news