కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజులో లక్షల్లో కేసులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. వ్యాక్సిన్ కొరత ఉండడంతో అందరికీ వ్యాక్సిన్ కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. దానివల కరోనా గురించిన ఆందోళన ఇంకా పెరిగింది. అదీగాక కరోనాలోని కొత్త రకాలు, జన్యుపరమైన మార్పుల వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంది. దానివల్ల కరోనా నుండి రికవరీ అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు తెలెత్తుతున్నాయి.
కరోనా నుండి రికవరీ అయ్యాక కనిపించే లక్షణాల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సినవి.
ఛాతినొప్పి
విపరీతమైన ఛాతినొప్పి, ఆ నొప్పి క్రమంగా చేతికి వ్యాపించడం, హృదయ స్పందనల్లో మార్పులు, తీవ్ర ఒత్తిడికి గురవడం మొదలగు లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. సులభంగా అలసిపోవడం, బలహీనంగా మారిపోవడం మొదలగు లక్షణాలన్నీ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తున్నాయి.
డయాబెటిస్
విన్సులిన్ నియంత్రణని వైరస్ నిరోధించడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. తరచుగా మూత్రవిసర్జన, చేతులు, పాదాల్లో తిమ్మిరి, అధిక అలసట, అధిక దాహం, కారణం లేకుండా ఆకలివేయదం మొదలగునవన్నీ లక్షణాలుగా కనిపిస్తాయి.
కిడ్నీవ్యాధులు
తరచుగా మూత్ర విసర్జన, ఒకేసారి బరువు తగ్గడం, చర్మం పొడిగా మారడం, దురద పెట్టడం, ఆకలి తగ్గడం, కాళ్ళు, చీలమండలలో వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తే అది మీ మూత్రపిండాల మీద ప్రభావం పడవచ్చు. అందుకే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మానసిక రుగ్మత
కరోనా నుండి కోలుకున్న వారిలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. నాడీ సంబంధ వ్యాధులు, మూడ్ డిజార్డర్, నిద్ర సరిగ్గా లేకపోవడం మొదలగు సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటే జాగ్రత్త పడాల్సిందే.