PDF ఫైల్స్‌ను Word ఫైల్స్‌గా ఇలా సుల‌భంగా క‌న్వ‌ర్ట్ చేసుకోండి..!

-

మన కంప్యూట‌ర్లు, మొబైల్ ఫోన్ల‌లో PDF డాక్యుమెంట్లు స‌హజంగానే చాలా సుల‌భంగా ఓపెన్ అవుతాయి. ఆ డాక్యుమెంట్ల‌లో ఉండే మ్యాట‌ర్‌ను చ‌దివేందుకు మాత్ర‌మే మ‌న‌కు వీలుంటుంది. PDF డాక్యుమెంట్ల‌లో ఉండే టెక్ట్స్‌ను మ‌నం ఎడిట్ చేసుకోలేం. అయితే కింద తెలిపిన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తే PDF డాక్యుమెంట్ల‌ను సుల‌భంగా Word డాక్యుమెంట్లలోకి క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు. దాంతో Word ఫార్మాట్‌లో ఉండే ఆ డాక్యుమెంట్ల‌ను మనం సుల‌భంగా ఎడిట్ చేసుకునేందుకు వీలు క‌లుగుతుంది. మ‌రి పీడీఎఫ్ ఫైల్స్‌ను వ‌ర్డ్ ఫార్మాట్‌లోకి ఎలా క‌న్వ‌ర్ట్ చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

how to convert a pdf file to word

1. కంప్యూట‌ర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి అందులో www.hipdf.com అనే సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. అందులో ఉండే పీడీఎఫ్‌ టు వర్డ్‌ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకుని అనంతరం వచ్చే విండోలో.. మీ డివైస్‌లో ఉండే పీడీఎఫ్ ఫైల్‌ను ఎంచుకుని అప్‌లోడ్‌ చేయాలి.

3. అనంతరం పీడీఎఫ్ డాక్యుమెంట్ ఆ సైట్‌లోకి అప్‌లోడ్ అవుతుంది.

4. అప్‌లోడ్ అయిన పీడీఎఫ్ ఫైల్‌ను క‌న్వ‌ర్ట్ బ‌ట‌న్ నొక్కి వ‌ర్డ్ ఫైల్‌గా క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు.

5. వర్డ్ ఫార్మాట్‌లోకి మారిన ఆ ఫైల్‌ను మ‌ళ్లీ మ‌నం డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

6. డౌన్‌లోడ్ చేసిన వ‌ర్డ్ ఫైల్‌ను ఓపెన్ చేసి దాన్ని మ‌ళ్లీ ఎడిట్ చేసుకోవ‌చ్చు.

ఇలా పీడీఎఫ్ ఫైల్స్‌ను సుల‌భంగా వ‌ర్డ్ ఫైల్స్ రూపంలోకి క‌న్వ‌ర్ట్ చేసి వాటిని తిరిగి ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ఇందుకు మ‌రోక ప‌ద్ధ‌తి కూడా ఉంది. అదేమిటంటే…

విండోస్ 10 పీసీలో Microsoft Word లేటెస్ట్ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేశాక‌.. ఆ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి అందులో మీకు కావ‌ల్సిన పీడీఎఫ్‌ను ఎంచుకోవాలి. దీంతో ఆ సాఫ్ట్‌వేర్ ఆ పీడీఎఫ్ ఫైల్‌ను ఆటోమేటిగ్గా వ‌ర్డ్ ఫార్మాట్‌లోకి మార్చి చూపిస్తుంది. దీంతో ఆ వ‌ర్డ్ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్‌ను మ‌నం సుల‌భంగా మ‌ళ్లీ ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఈ విధంగా రెండు ప‌ద్ధ‌తుల్లో పీడీఎఫ్ ఫైల్స్‌ను వ‌ర్డ్ ఫైల్స్‌గా క‌న్వ‌ర్ట్ చేసుకోవ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news